LIVE
అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్సీల వాగ్వాదం
వెనక్కి

అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్సీల వాగ్వాదం

45 రోజుల క్రితం
సారాంశం

ఏపీలోని అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్సీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం విషయంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణిల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సభకు ఆలస్యంగా హాజరైన వరుదు కల్యాణిపై లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ పేరుతో వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు సభలో ఉండాల్సిన బాధ్యత లేదా అని ఆయన ఆమెను ప్రశ్నించారు. తీర్మానం ఇచ్చిన వారే సభలో లేకపోతే ఎలాగని మండలి చైర్మన్ కూడా ప్రశ్నించిన విషయాన్ని అప్పిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ఈ విమర్శలపై వరుదు కల్యాణి కూడా గట్టిగానే స్పందించారు. తన పేరు మీద వాయిదా తీర్మానం ఇస్తున్నప్పుడు కనీసం ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె లేళ్ల అప్పిరెడ్డిని ఎదురు ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభా కార్యక్రమాలకు సంబంధించి సమన్వయ లోపం కారణంగానే ఈ వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 02:46 PMకి