LIVE
BCCI Continues To Show Steady Financial Growth
వెనక్కి
Sports

2027 వరల్డ్ కప్ కోసం ప్రాబ‌బుల్స్ లిస్ట్‌ రెడీ?

30 రోజుల క్రితం
సారాంశం

2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పట్నుంచే జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టింది. ఈ మెగాటోర్నీ కోసం ఇప్ప‌టికే 20 మంది స‌భ్యుల‌తో కూడిన ప్రాబ‌బుల్స్ లిస్ట్‌ను రెడీ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఐపీఎల్ నుంచి వీరి ఆట‌ను అటు సెల‌క్ట‌ర్ల‌తో పాటు ఇటు బీసీసీఐ పెద్ద‌లు కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌బోతున్నారు. ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా , ప్రజ్ఞాన్ ఓఝాలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ స్టేడియాన్ని సందర్శించడంతో పాటు, ఐపీఎల్ మ్యాచ్‌లను టెలివిజన్‌లో కూడా వీక్షిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపిన‌ట్లు పీటీఐ వెల్ల‌డించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను సెల‌క్ట‌ర్లు గ‌మ‌నిస్తున్నారంటే దాని అర్థం.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2028, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం కాదని.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోస‌మేని తెలిపింది.

షేర్ చేయండి:
21 మార్చి, 2026 09:04 AMకి

సంబంధిత వార్తలు

సిజిన్ షిప్ కు నో చెప్పిన రషీద్

సిజిన్ షిప్ కు నో చెప్పిన రషీద్

తనకు భారత్, ఆస్ట్రేలియా నుంచి సిటిజిన్ షిప్ ఆఫర్స్ వచ్చాయని అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు. కానీ నేను నా దేశం తరఫున మాత్రమే ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు బీసీసీఐకు చెందిన ఓ అధికారి భారత్ లోనే జీవించండి. క్రికెట్ ఆడండని ఆఫర్ చేశారు. కానీ నా సొంత దేశానికి మాత్రమే ఆడాలనుకుంటున్నానని చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు.

37 నిమిషాల క్రితం
ఆ క్రికెటర్ కే నా బ్యాట్ బహుమతి: శ్రేయస్

ఆ క్రికెటర్ కే నా బ్యాట్ బహుమతి: శ్రేయస్

పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భలే ఆఫర్ ఇచ్చాడు. ఈ IPL సీజన్ లో అత్యధిక సిక్స్ లు ఎవరు కొడతారో వారికి తన బ్యాట్ ను గిఫ్టిగ్ ఇస్తానని చెప్పాడు. లక్నోపై భారీ విజయం తర్వాత శ్రేయస్ మాట్లాడుతూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రియాంశ్ ఆర్యపై ప్రశంసలు కురిపించాడు. సిక్సర్ల గురించి జట్టు సమావేశాల్లో చర్చింకుంటామని, ఎవరైతే ఎక్కువ సిక్స్ లు కొడతారో వారికి తన బ్యాట్ గిఫ్టుగా ఇస్తానన్నాడు.

54 నిమిషాల క్రితం
రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

17 గంటల క్రితం
టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

17 గంటల క్రితం