LIVE
Amitabh Bachchan
వెనక్కి
Sports

టీమ్ ఇండియా విజయంపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

41 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

టీమ్ ఇండియా విజయంపై బాలీవుడ్ మెగాస్టార్ టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ అద్భుత విజయంపై దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువెత్తుతుండగా సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొంచెం భిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. “నేను చూడలేదు కాబట్టే గెలిచారు” నేను మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది” అని సరదాగా వ్యాఖ్యానించాడు. తాను లైవ్‌లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు అదృష్టం కలిసిరాదనే ఒక సెంటిమెంట్ తనకు ఉందని అమితాబ్ బచ్చన్ గతంలో కూడా పలుమార్లు వెల్లడించారు. అదే కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్‌ను కూడా తాను చూడలేదని ఆయన సరదాగా పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. “మీరు చేసిన త్యాగం గొప్పది సర్.. ఇకపై కూడా ఇలా మ్యాచ్ చూడకుండా ఉండండి” అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, “మేము కూడా మ్యాచ్ చూడలేదు.. అందుకే భారత్ గెలిచింది” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

షేర్ చేయండి:
9 మార్చి, 2026 06:03 PMకి

సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

9 గంటల క్రితం
టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

9 గంటల క్రితం
జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

9 గంటల క్రితం
జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

9 గంటల క్రితం