సారాంశం
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యానారయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన బీపీలో ఒక్కసారిగా హెచ్చు తగ్గులు రావటంతో కాసేపు సొమ్మసిల్లి పోయారు. దీంతో హుటహుటీన అసెంబ్లీ సిబ్బంది వైద్యులను పిలిపించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ నకు గురైన బొత్స పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు శాసన మండలికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అస్వస్థతకు గురవ్వటంతో బొత్స కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
6 మార్చి, 2026 04:29 PMకి