LIVE
బీహార్ సీన్ ఏపీలో రిపీట్ అవుతుందా..? చంద్రబాబు ఢిల్లీకి వెళతారా?
వెనక్కి

బీహార్ సీన్ ఏపీలో రిపీట్ అవుతుందా..? చంద్రబాబు ఢిల్లీకి వెళతారా?

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేసి హస్తినలో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందా..? అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. బీహార్ ఎపిసోడ్ ఏపీలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని కొంత మంది ఊహాగానాలు చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈ ఛాన్సే లేదని కొట్టి పారేస్తున్నారు. అయితే వయసు పైబడటంతో తన సీఎం బాధ్యతలను లోకేష్ కు అప్పచెప్పి చెంద్రబాబు కేంద్ర కేబినెట్ లో గానీ, లేదా దానికి మించిన పోస్టును హస్తినలో చేపడతారని అనేక మంది భావిస్తున్నారు. దీంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 02:51 PMకి