LIVE
Screenshot 2026 03 10 115543
వెనక్కి
Crime

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో రిటైర్డ్ జడ్జికి టోకరా.. ₹1.66 కోట్లు మోసం

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఓ రిటైర్డ్ జడ్జిని మోసం చేసి భారీ మొత్తాన్ని దోచుకున్నారు. నేరెడ్‌మెట్ ప్రాంతంలో నివసించే 73 ఏళ్ల విశ్రాంత న్యాయమూర్తికి ఫిబ్రవరి 23న ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులు అని చెప్పి భయపెట్టారు. అతని మొబైల్ నంబర్ మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులతో సంబంధం ఉందని, సుప్రీంకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెబుతూ వీడియో కాల్స్ ద్వారా బెదిరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఆర్థిక లావాదేవీలను పరిశీలించాల్సి ఉందని నమ్మించి, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య నాలుగు విడతల్లో ₹1.66 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తర్వాత మోసం జరిగినట్టు గ్రహించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

షేర్ చేయండి:
10 మార్చి, 2026 11:56 AMకి

సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

10 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

11 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

11 గంటల క్రితం
OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.

12 గంటల క్రితం