LIVE
వైభవంగా భట్టి తనయుడి వివాహం
వెనక్కి

వైభవంగా భట్టి తనయుడి వివాహం

45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల పరిణయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులు సూర్య విక్రమాదిత్య- సాక్షిల జంటను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌ ముచ్చటించారు.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 06:51 PMకి