LIVE
కర్ణుడు కాదు మహాక్రూరుడు..రేవంత్ పై హరీష్ ఫైర్
వెనక్కి

కర్ణుడు కాదు మహాక్రూరుడు..రేవంత్ పై హరీష్ ఫైర్

43 రోజుల క్రితం
సారాంశం

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కర్ణుడు కాదని, కుంభకర్ణుడని ఎద్దేవా చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....తాను కర్ణుడిలాంటి వాడినన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను తాను కర్ణుడితో పోల్చుకుంటున్న ముఖ్యమంత్రి మహాక్రూరుడు అని మండిపడ్డారు. కర్ణుడు మాటతప్పని వాడని, తన కవచ కుండలాలను కూడా దానం చేసిన త్యాగధనుడని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని అన్నారు.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 05:01 PMకి