LIVE
HUSBAND MURDER
వెనక్కి
Crime

ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను దారుణంగా హతమార్చిన భార్య

41 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య భర్తను అత్యంత క్రూరంగా హత్య చేయించి, ఆపై దానిని రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అమానవీయ ఘటన ఖమ్మం రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఖమ్మం నగరం గాంధీనగర్‌‌‌‌లో నివాసం ఉంటున్న చాగంటి రవి (55) పెయింటింగ్​ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య చాగంటి ప్రశాంతి (40) తోపాటు బావమరిది వరుసయ్యే దేశబోయిన శ్రీనివాస్​ (30), జోగి రాజ్ కుమార్ (28), జోగి వెంకటేశ్‌‌ (36), జోగి రాంబాబు(36).. ప్లాన్​ ప్రకారం రూ. 66 లక్షల ఇన్సూరెన్స్​ చేయించారు. ------------ ఆ​ డబ్బులతో పాటు రవికి చెందిన ఎర్టిగా కారును కూడా అమ్ముకుందామని ప్లాన్‌‌ వేశారు. ప్రమాదంలో రవి మృతి చెందితే డబ్బులు క్లెయిమ్​ చేయొచ్చని.. యాక్సిడెంట్​ చేసి చంపుదామని స్కెచ్‌‌ గీశారు. ముందుగానే వేసిన ప్లాన్​ ప్రకారం ఈ నెల 2న రవికి కాల్​ చేసి మందు తాగుదామని బయటకు తీసుకెళ్లారు. రవికి బాగా మద్యం తాగించిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి రూరల్​ మండలం ఎం వెంకటాయపాలెం ఊరి చివరి దించి.. ఆ నలుగురు ఆటోలో వెళ్లిపోయారు. -------- మద్యం మత్తులో ఉన్న రవి వెంకటాయపాలెం వైపు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందే వేసుకున్న ప్లాన్‌‌ ప్రకారం.. వెంకటేశ్‌‌కు చెందిన కారును జోగి రాజ్​కుమార్​ వేగంగా నడుపుకుంటూ వచ్చి రవిని వెనుకనుంచి ఢీ కొట్టాడు. దీంతో రవి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనతరం నిందితులు తనగంపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌‌​ స్నేహితుడు దంచినాలు సురేశ్‌‌​ ఇంటి వద్ద కారును పెట్టి.. కవర్‌‌‌‌ కప్పి వెళ్లిపోయారు. -------- అనంతరం జరిగిన విషయం తనకు తెలియనట్లు రవి భార్య పోలీస్​ స్టేషన్​కు వెళ్లి.. తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి కేసును వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి ఒక కారు, ఆటో, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు ఎస్‌‌హెచ్‌‌వో ముష్క రాజు తెలిపారు.

షేర్ చేయండి:
9 మార్చి, 2026 01:34 PMకి

సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

8 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

9 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

9 గంటల క్రితం
OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.

10 గంటల క్రితం