ఇరాన్ తన క్షిపణి దాడుల తీవ్రతను పెంచింది. శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఒక శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ఇజ్రాయెల్‌లోని జర్జిర్ పట్టణంలోని ఒక బహుళ అంతస్థుల భవనాన్ని నేరుగా తాకింది. ఈ దాడిలో భవనం కుప్పకూలడమే కాకుండా, సుమారు 30 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ ధృవీకరించింది. గాజు పెంకులు గుచ్చుకోవడం, శిథిలాలు పడటంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, కొన్ని మాత్రం లక్ష్యాలను తాకడం ఇజ్రాయెల్ రక్షణ విభాగాలను ఆందోళనలో పడేసింది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు.
సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్ బెడ్‌పై బాలింతను చంపిన భర్త
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్
HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.