సారాంశం
సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యాన సీఎం సమక్షంలో సరెండర్ అయ్యారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం 130 మంది 124 తుపాకులతో లొంగిపోవడం విశేషం. వీటిలో 31 ఏకే 47 తుపాకులున్నాయి. ఈ సందర్భంగా నక్సల్స్ అప్పగించిన తుపాకులను సీఎం పరిశీలించారు. లొంగిపోయిన వారిలో 125 మంది చత్తీస్‌గఢ్, నలుగురు తెలంగాణకు చెందిన అజ్ఞాతంలో ఉన్నవారు , ఒకరు ఏపీకి చెందిన వారని డీజీపీ వెల్లడించారు.
7 మార్చి, 2026 05:06 PMకి