సారాంశం
ఇంటర్నెట్‌డెస్క్: హర్మూజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ దాడుల ప్రభావంతో చమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 894 పాయింట్లు పడిపోయి 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273 పాయింట్లు క్షీణించి 23,593 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 31 పైసలు తగ్గి 92.32కి చేరింది. నిఫ్టీలో కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉండగా ఎంఅండ్ఎం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో మార్కెట్లు అస్థిరంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
12 మార్చి, 2026 09:58 AMకి
