LIVE
ఇరాన్ ఆక్రమణా...టైం వేస్ట్?
వెనక్కి

ఇరాన్ ఆక్రమణా...టైం వేస్ట్?

44 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్‌ను ఆక్ర‌మించే ఉద్దేశం త‌మ‌కు లేదంటున్నారు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. స‌మ‌యం వృధా త‌ప్ప‌, దాంట్లో ఏమీ లేద‌న్నారు. అమెరికా బ‌ల‌గాల‌ను ఇరాన్‌కు పంపే ఆలోచ‌న లేద‌న్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు.. గ‌త శ‌నివారం నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వార్‌లో ఇప్ప‌టికే వేల మంది చ‌నిపోయారు. క్షిప‌ణులు, డ్రోన్ల‌తో ఇరు ద‌ళాలు విరుచుకుప‌డుతున్నాయి. అయితే భూత‌ల యుద్ధం చేప‌ట్టేందుకు బ‌ల‌గాల‌ను ఇరాన్‌కు పంపాల‌న్న ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని ట్రంప్ అన్నారు. అలా చేస్తే స‌మ‌యం వృధా చేయ‌డ‌మే అవుతుంద‌ని, ఇరాన్ అన్నీ కోల్పోయింద‌ని, ఆ దేశం నేవీ కూడా పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పుకొచ్చారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 04:22 PMకి