నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు దక్షిణాది సినీ పరిశ్రమలో చిచ్చు రేపాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన, అలనాటి నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంతారావు పేరు చెబితేనే ఎంజీఆర్ భయపడేవారని, ఆ సందర్భంలో ఆయన ప్రవర్తన, వాడిన పదజాలం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. వివాదంపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గౌరవనీయమైన సీనియర్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ గారిని అంత తక్కువ చేసి మాట్లాడటం తనను షాక్‌కు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొక మహానుభావుడిని కించపరచడం సరైన పద్ధతి కాదని విశాల్ హితవు పలికారు.
సంబంధిత వార్తలు

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ
పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో చేసిన హరిహర వీరమల్లు, రాజాసాబ్'చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో నిధి అగర్వాల్‌కు ఐరన్ లెగ్ ముద్ర పడింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాలో నిధిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది.

MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్
రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ పూర్తయింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్ సమ్మర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆమె ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు టాక్.
.png)
పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.పూరీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్' చిత్రం కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

"హ్యాపీ బర్త్‌డే మావయ్య " చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు ఎన్టీఆర్ 'ఎక్స్' వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్ బంధాన్ని గుర్తుచేస్తూ 'మావయ్య' అని సంబోధించడం నందమూరి, నారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
