LIVE
Screenshot 2026 03 23 111743
వెనక్కి
CrimePolitics

ధ్వంసమైన కారు వచ్చింది గానీ.. వాళ్ళపై చర్యలేవీ: అంబటి

27 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తన కారును ధ్వంసం చేసిన ఘటనలో ద్వంద్వ వైఖరి అనుసరించారని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు పగలకొట్టిన తన కారును పోలీసులు సీజ్ చేసి 50 రోజులు ఉంచి, కోర్టు ఆదేశాలతోనే విడుదల చేశారని తెలిపారు. అయితే కారును ధ్వంసం చేసిన వారిని మాత్రం ఒక్కరోజు కూడా స్టేషన్‌లో పెట్టలేదని విమర్శించారు. ఈ వ్యవహారం పాలనలో అన్యాయాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు.

షేర్ చేయండి:
23 మార్చి, 2026 11:16 AMకి

సంబంధిత వార్తలు

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

తన తల్లి జన్మదినంపై జగన్‌ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ విజయలక్ష్మి 70వ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల, లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడం గమనార్హం. ఆర్దిక వివాదాల నేపథ్యంలోనే జగన్ తన తల్లి పుట్టిన రోజును పట్టించుకోలేదనే వాదనలు వినిపి స్తున్నాయి. ఇదే సమయంలో శస్త్రచికిత్స అనంతరం పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

1 గంటల క్రితం
EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

10 గంటల క్రితం
కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

10 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

11 గంటల క్రితం