LIVE
Amith Shah In West Bengal Election Campaign
వెనక్కి
NationalPolitics

అధికారంలోకి వస్తే గోర్కా సమస్య పరిష్కారం : అమిత్ షా

1 గంటల క్రితం
సారాంశం

బీజేపీ అధికారంలోకి వస్తే దశాబ్దాల నాటి గోర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బెంగాల్‌లోని కుర్సియాంగ్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ మాత్రమే గోర్కా సమస్యను పరిష్కరించగలదని, గోర్కాల మనోభావాలను, ఆందోళనలను అర్థం చేసుకోగలదని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే గోర్కాల ముఖంలో ఆనందాన్ని చూడవచ్చని అమిత్ షా తెలిపారు.

షేర్ చేయండి:
21 ఏప్రిల్, 2026 03:43 PMకి

సంబంధిత వార్తలు

 కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ సీఎం..జీవన్ రెడ్డి

కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ సీఎం..జీవన్ రెడ్డి

కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న ఆయన.. కేసీఆర్ ను పట్టుకుని ఉరితీస్తాను అంటావా అని మండిపడ్డారు. ప్రజాపాలన నెపంతో కాంగ్రెస్ ప్రజలను వంచిస్తుందని అన్నారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని దుయ్యబట్టారు.

33 నిమిషాల క్రితం
BRS UPDATE : రేవంత్ ఓటుకు నోటు కేసుపై పోరాటం

BRS UPDATE : రేవంత్ ఓటుకు నోటు కేసుపై పోరాటం

రేవంత్ రెడ్డికి సంబంధించిన 'ఓటుకు నోటు' కేసు విచారణ రేపు సుప్రీంకోర్టులో జరగనుందని BRS నేత హరీష్ రావు తెలిపారు. రేవంత్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తాము కూడా ఈ కేసులో కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం ప్రభుత్వం ఒక బలహీనమైన PPని నియమించిందని ఆరోపించారు.

51 నిమిషాల క్రితం
తెలంగాణలో కమలం జెండా ఖాయం : ఎంపీ అరవింద్

తెలంగాణలో కమలం జెండా ఖాయం : ఎంపీ అరవింద్

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సభలపై ఆయన స్పందించారు. కేసీఆర్ శకం ముగిసిందని, ఆయన సభలు వెబ్ సిరీస్‌ల మాదిరిగా సీజన్ 1, 2 నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఎప్పుడైనా మాట్లాడారా అని అరవింద్ ప్రశ్నించారు.

1 గంటల క్రితం
పర్యాటక కేంద్రంగా  కరీంనగర్‌ : బండి సంజయ్

పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ : బండి సంజయ్

కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ రేకుర్తి చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేస్తూ నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అమృత 2.0 పథకం కింద చెరువులకు మరమ్మత్తులు అభివృద్ధి చేస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దుతామన్నారు.

1 గంటల క్రితం