LIVE
అనిల్ అంబానీకి ఈడీ షాక్
వెనక్కి

అనిల్ అంబానీకి ఈడీ షాక్

44 రోజుల క్రితం
సారాంశం

ప్రముఖ పారిశ్రామికవేత్త, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బిగ్ షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పాటు హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో సుమారు 15 బృందాలు ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఫిబ్రవరి 27న అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన ఆ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు, కీలక ఆధారాల సేకరణ కోసం నేరుగా కంపెనీ కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 12:28 PMకి