సారాంశం
ఒకప్పుడు టీచర్ గా సేవలు అందించిన హోమ్ మంత్రి అనిత... మరోసారి టీచర్ అవతారం ఎత్తారు. శాసనసభ సందర్శనకు వచ్చిన పిల్లలను చూసి వాళ్లతో చాలా సేపు మాట్లాడారు. సభ విరామ సమయంలో హోం మంత్రి అనిత విద్యార్థులతో ముచ్చటించారు. చిన్నారులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన మంత్రి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల కళ్లలో కనిపించిన కుతూహలం, దేశం పట్ల వారికి ఉన్న బాధ్యతాయుతమైన ఆలోచనలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని మంత్రి అనిత తెలిపారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు ఆమె సూచించారు. మరోసారి టీచర్ గా మారి, పిల్లలతో కలిసిపోవటం ఆసక్తికరంగా నిలిచింది.
5 మార్చి, 2026 05:22 PMకి