LIVE
Assembly Postponed
వెనక్కి
Politics

తెలంగాణ అసెంబ్లీ, మండలి వాయిదా

30 రోజుల క్రితం
Telangana
సారాంశం

అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై ప్రసంగించిన అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవ్వగా.. రూ.3,24,234 కోట్లతో రూపొందించిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ ను భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. ఓ వైపు బడ్జెట్ పై భట్టి విక్రమార్క ప్రసంగిస్తుండగానే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేలా లేదని విమర్శిస్తూ.. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.

షేర్ చేయండి:
20 మార్చి, 2026 03:36 PMకి

సంబంధిత వార్తలు

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

28 నిమిషాల క్రితం
JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

42 నిమిషాల క్రితం
సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

48 నిమిషాల క్రితం
బీజేపీ,బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం: ఆది శ్రీనివాస్

బీజేపీ,బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం: ఆది శ్రీనివాస్

కేటీఆర్, హరీష్ రావులకు ప్రజల సమస్యల కంటే బురద చల్లడమే పనిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.ఇద్దరూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే నాయకులని ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని, వారిది విడదీయలేని ఫెవికాల్ బంధమని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.

1 గంటల క్రితం