LIVE
Seethakka
వెనక్కి
Politics

ఉద్యోగాల రగడ..హరీశ్‌రావుకు సీతక్క కౌంటర్

27 రోజుల క్రితం
Telangana
సారాంశం

అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి ఢిల్లీ వాయే.. జాబులేమో రాకపాయే’ అంటూ అశోక్ నగర్ లాఠీచార్జీలను హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 10 ఏండ్లు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు ఏం ఇచ్చారు? అని ప్రశ్నించారు. 10 ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని మంత్రి సీతక్క నిలదీశారు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనా? అని ప్రశ్నించారు. పాండవులు సంపాదించింది అంత కౌరవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లుగా ఉంది మా ప్రభుత్వ పరిస్థితి అని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందని అన్నారు.

షేర్ చేయండి:
23 మార్చి, 2026 06:23 PMకి

సంబంధిత వార్తలు

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.

2 నిమిషాల క్రితం
చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

22 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

38 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

49 నిమిషాల క్రితం