LIVE
Images (1)
వెనక్కి
Politics

ఏపీ, తెలంగాణలో పెరగబోయే స్థానాలు ఇవే!

27 రోజుల క్రితం
సారాంశం

నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగస్వామ్య పక్షాల నేతలకు వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 08:52 AMకి

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

19 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

35 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

46 నిమిషాల క్రితం
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

57 నిమిషాల క్రితం