ఆప్ఘన్ పై పాకిస్థాన్ దాడి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లను అలర్ట్ చేసింది. . పాకిస్థాన్ సూపర్ లీగ్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. దీంట్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లుబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తదితర ఆసీస్ ప్లేయర్లు పాల్గొననున్నారు. ఆసీస్ మాజీ క్రికెటర్లు టిమ్ పైన్, గిలెస్పీ ఈ లీగ్‌లో కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాక్‌కు వెళ్లినా పర్లేదు కానీ.. పెషావర్ అనే నగరంలో మాత్రం అడుగు పెట్టొదంటూ ఆసీస్ ప్రభుత్వం వారిని హెచ్చరించింది. పెషావర్ నగరాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నో ట్రావెల్ జోన్‌లో చేర్చింది. అక్కడ ఏ నిమిషమైనా దాడులు జరగొచ్చంటూ పేర్కొంది. అయితే ఈ నగరంలోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో మార్చి 28న పెషావర్ జల్మీ, రావల్పిండి పిండిజ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు జట్లలోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఆ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.
సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్
KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!
కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.