LIVE
Screenshot 2026 04 20 112202
వెనక్కి
General

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

1 గంటల క్రితం
Andhra Pradesh
సారాంశం

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి:
20 ఏప్రిల్, 2026 11:22 AMకి

సంబంధిత వార్తలు

GREAT INDIA: ప్రపంచానికి భారత రైల్వే శక్తి

GREAT INDIA: ప్రపంచానికి భారత రైల్వే శక్తి

Indian Railways మరోసారి తన తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. Banaras Locomotive Worksలో తయారైన చివరి రెండు 3,300 హెచ్‌పీ లోకోమోటివ్‌లు Maputoకు చేరడంతో, Mozambiqueకు మొత్తం 10 లోకోమోటివ్‌ల సరఫరా విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా “Make in India, Make for the World” లక్ష్యాన్ని భారత్ మరింత బలంగా నిలబెట్టింది.

12 నిమిషాల క్రితం
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవంలో ప్రముఖుల సందడి!

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవంలో ప్రముఖుల సందడి!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. * రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకున్నారు . * ప్రభుత్వ అధికారులు, శారదా పీఠాధిపతులు, ప్రభుత్వ ప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్నారు

12 నిమిషాల క్రితం
పిఠాపురం బేకరీలో పురుగుల బిస్కెట్లు..

పిఠాపురం బేకరీలో పురుగుల బిస్కెట్లు..

AP: పిఠాపురంలో బేకరీ బిస్కెట్లలో పురుగులు బయటపడటం కలకలం రేపింది. కాకినాడ జిల్లా రూత్ నీలిమ బేకరీలో కొనుగోలు చేసిన బిస్కెట్లను కుమారుడికి ఇస్తుండగా జీవన్‌నగర్‌కు చెందిన డేవిడ్ పురుగులు గుర్తించారు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు బేకరీ షట్టర్లు మూసివేసి ఆందోళనకు దిగారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నారు.

19 నిమిషాల క్రితం
అక్షయ తృతీయ వేళ వెలవెలబోయిన బంగారం విక్రయాలు!

అక్షయ తృతీయ వేళ వెలవెలబోయిన బంగారం విక్రయాలు!

భారతదేశంలో బంగారం కొనుగోళ్లకు అత్యంత పవిత్రమైన రోజైన 'అక్షయ తృతీయ' నాడు ఈసారి డిమాండ్ ఊహించిన స్థాయిలో లేదు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్య ప్రజలు కేవలం సంప్రదాయం కోసం నాణేలు లేదా చిన్న వస్తువులకే పరిమితమయ్యారు. ధరలు భారీగా పెరగడం వల్ల పెట్టుబడిదారులు సైతం ఆచితూచి అడుగు వేయడంతో, ఈ పండగ సీజన్‌లో నగల దుకాణాలు ఆశించిన స్థాయిలో సందడిని చూడలేకపోయాయి.

28 నిమిషాల క్రితం