LIVE
IMG 4489
వెనక్కి
CrimePolitics

బీజేపీ మాజీ ఎంపీ బల్బీర్ పుంజ్ కన్నుమూత

13 గంటల క్రితం
సారాంశం

ప్రముఖ పాత్రికేయులు, బీజేపీ మాజీ ఎంపీ బల్బీర్ పుంజ్ (76) కన్నుమూశారు. ఆయన 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' గ్రూపులో సుదీర్ఘకాలం పనిచేశారు. సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న మేధావిగా గుర్తింపు పొందారు. ‘ట్రిస్ట్ విత్ అయోధ్య: డీకలోనైజేషన్ ఆఫ్ ఇండియా’ వంటి పుస్తకాల ద్వారా తనదైన ముద్ర వేశారు. బల్బీర్ పుంజ్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 09:19 AMకి

సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

57 నిమిషాల క్రితం
కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

1 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

2 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

2 గంటల క్రితం