LIVE
Pandya
వెనక్కి
CrimeSports

హార్దిక్ పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు..

38 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ Hardik Pandyaపై జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం అహ్మదాబాద్‌లో జరిగిన సంబరాల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. విజయోత్సవాల్లో పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ విషయంపై పుణేలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

షేర్ చేయండి:
12 మార్చి, 2026 10:01 AMకి

సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

7 గంటల క్రితం
BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

7 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

8 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

8 గంటల క్రితం