LIVE
Cm Chandrabu On Jagan
వెనక్కి
Politics

పేదలకు అన్నం లేకుండా చేసిన జగన్ : చంద్రబాబు

1 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదవాడికి అన్నం లేకుండా చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు దానికి పట్టవని వైసీపీపై పరోక్షంగా మండిపడ్డారు.పేదలకు కడుపునిండా అన్నం పెట్టడానికి జగన్ అండ్ కోకు మనసొప్పదని విమర్శించారు. పేదవారికి అన్నం పెట్టలేని పార్టీలు ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 03:20 PMకి

సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

8 గంటల క్రితం
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

10 గంటల క్రితం
JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

10 గంటల క్రితం
సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 గంటల క్రితం