LIVE
Screenshot (1065)
వెనక్కి
Politics

ఏపీ సీఎం ఎంట్రీ.. తమిళనాట మారుతున్న సమీకరణాలు

2 గంటల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్డీయే అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రధానంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బహిరంగ సభల్లో పాల్గొంటూ, ఎన్డీయే అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని వివరిస్తారు.

షేర్ చేయండి:
20 ఏప్రిల్, 2026 10:49 AMకి

సంబంధిత వార్తలు

తమిళం లో ప్రసంగించిన చంద్రబాబు

తమిళం లో ప్రసంగించిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులు నివసించే హోసూరు, తళ్ళి ప్రాంతాల్లో ఆయన ర్యాలీ నిర్వహిస్తారు. కోయంబత్తూరు లో జరిగిన మీటింగ్ లో తమిళంలో ప్రసంగించి ఆకట్టుకొన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తమిళనాడుకు ఆనుకుని ఉంటుంది.

5 నిమిషాల క్రితం
BRS UPDATE : ఢిల్లీకి కేసీఆర్ టీం.. ఫిరాయింపులు, కాళేశ్వరం కేసులు

BRS UPDATE : ఢిల్లీకి కేసీఆర్ టీం.. ఫిరాయింపులు, కాళేశ్వరం కేసులు

BRS పార్టీ కీలక నేతల ఢిల్లీ టూర్ పై అప్ డేట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి వెళ్లింది. KCR ఆదేశాల మేరకు హరీష్‌రావు, వినోద్ కుమార్, MP వద్దిరాజు రవిచంద్ర సాయంత్రం ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

13 నిమిషాల క్రితం
రేవంత్ రెడ్డి అభినవ గోబెల్స్: బండి సంజయ్

రేవంత్ రెడ్డి అభినవ గోబెల్స్: బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డిని 'అభినవ గోబెల్స్' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలు, మోసాలతోనే సీఎం అయ్యారని, 6 గ్యారంటీలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఇండియా కూటమి నేతలు అడ్డుకున్నారని, ఇందులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మండిపడ్డారు.

15 నిమిషాల క్రితం
చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా..!!

చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా..!!

సీఎం చంద్రబాబు కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు ల మీద బాబు దృష్టి పెట్టారు అని చెప్పారు. సుపరిపాలన ద్వారా మంచి ప్రభుత్వం అన్న మాట ను చంద్రబాబు సాకారం చేస్తారు అని ఆకాంక్షించారు.

22 నిమిషాల క్రితం