
OFF THE RECORD: గవర్నర్ తో భేటీ అందుకేనా..?
CM రేవంత్‌రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. విద్యారంగంలో మార్పులు, పలు అంశాలపై చర్చించామని ప్రకటించారు. కానీ, పెండింగ్‌లో ఉన్న ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి సీఎం చర్చించినట్టు తెలిసింది. మంత్రి అజారుద్దీన్ పదవీ ప్రమాదంలో ఉండటం, AICC ఆదేశాలతో సీఎం.. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!
హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు
బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.