LIVE
3129a066 541c 4361 Bab9 2ed331dc7332 4
వెనక్కి
Politics

CM PRESS MEET: పంతం కాదు.. మళ్ళీ మహిళా బిల్లు పెట్టండి: రేవంత్

1 రోజుల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

మహిళా రిజర్వేషన్ల అనేది ఒక గొప్ప బాధ్యత, గొప్ప అవకాశం అని CM రేవంత్ రెడ్డి అన్నారు. PM మోడీ పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలను ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింప చేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. 2021 నుంచి 543 LS సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన సవరణలు తీసుకురావాలన్నారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 02:03 PMకి

సంబంధిత వార్తలు

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

తన తల్లి జన్మదినంపై జగన్‌ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ విజయలక్ష్మి 70వ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల, లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడం గమనార్హం. ఆర్దిక వివాదాల నేపథ్యంలోనే జగన్ తన తల్లి పుట్టిన రోజును పట్టించుకోలేదనే వాదనలు వినిపి స్తున్నాయి. ఇదే సమయంలో శస్త్రచికిత్స అనంతరం పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

1 గంటల క్రితం
EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

10 గంటల క్రితం
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

12 గంటల క్రితం
JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

12 గంటల క్రితం