LIVE
Hyderabadmetro 1
వెనక్కి
Politics

ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణ

27 రోజుల క్రితం
Telangana
సారాంశం

హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందకు తెచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని చెప్పారు. శాసనమండలి సభ్యులు లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో, రోడ్ల విస్తరణపై సమగ్రంగా వివరించారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లక్ష్యంతో రూ. 24 వేల కోట్లతో మెట్రో రెండో దశ 76 కి.మీ మేరకు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు.

షేర్ చేయండి:
23 మార్చి, 2026 06:12 PMకి

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

20 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

36 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

47 నిమిషాల క్రితం
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

59 నిమిషాల క్రితం