శ్రీరామనవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్రకు 3 వేల మంది పోలీస్ బందోబస్త్, డ్రోన్లు,సీసీ కెమెరాల నిఘాతో పరిశీలిస్తామని చెప్పారు.
సంబంధిత వార్తలు
76వ వసంతంలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. సమకాలీన రాజకీయ ప్రపంచంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. 76 ఏళ్ళ వయస్సులోనూ అలుపెరుగ కుండా పని చేస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
ఉదయం 5 గం. నుంచే మెట్రో రైల్ సర్వీసులు..?
హైదరాబాద్‌లో మెట్రో సేవల సమయాలు త్వరలో మారే అవకాశం ఉంది . ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న మెట్రోను 5 గంటల నుంచే నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ కు సీఎస్ రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. తెల్లవారు జామునే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు చేరే రైళ్ళతో పాటు ,వందేభారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ల కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టైమింగ్స్ మార్చాలని లేఖ రాశారు.
ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ దేవ్‌పూర్ వద్ద గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ రెండున్నరేళ్ల క్రితం కుంగిపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతు న్నాయి. బోర్ డ్రిల్లింగ్ సహా జరుగుతున్న పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. NDSA మార్గదర్శకాల మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశించారు. అనంతరం సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
తిరుమల: శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం
శ్రీవారిమెట్టు మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత సరస్వతీ మండపం వద్ద తిరుగుతుండగా కాలినడక భక్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది చేరుకుని చెట్టు కొమ్మపై ఉన్న చిరుతను చూశారు. సిబ్బంది హడావుడి చేయడంతో అది అడవిలోకి జారుకుంది. భక్తులను అప్రమత్తం చేసిన అధికారులు గుంపులుగా ప్రయాణించాలంటూ సూచించారు.
