సారాంశం
దిగజ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖకు వస్తోంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎన్టీపీఐ)లో తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో 'వెల్కం ఐబీఎం' అంటూ ఎక్స్ వేదికగా ఎన్టీపీఐ పోస్టు చేసింది. విశాఖ కేంద్రంగా మూడేళ్లలో ఐబీఎం రూ.321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు చేయనున్నట్లు అందులో ప్రకటించారు. ఐబీఎం ద్వారా స్థానికంగా 502 మందికి ఉపాధి కలగనుంది. విశాఖలో ఇప్పటికే అనువైన స్థలం సేకరించి, కార్యాలయ భవనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
3 మార్చి, 2026 12:53 PMకి