ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మహేశ్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు హరీశ్ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ శంకర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ వివాదంపై హరీశ్ శంకర్ వెంటనే స్పందించారు. సినిమా షూటింగ్, సెన్సార్ పనుల హడావుడిలో ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవలేదని, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని తెలిపారు. తనకు మహేశ్ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో ఆయన ‘పోకిరి’ సినిమాను ఎంతగానో ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమా భారీ రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.
సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ
విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?
భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.
