రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ పై సీబీఐ వేటు..డ్రోన్ దిగుమతుల కేసులో సంచలన మలుపు!
డ్రోన్ దిగుమతులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందేందుకు లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ సంచలన చర్యలు తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ భరత్ మాథుర్, ఏవియేషన్ రెగ్యులేటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముదావత్ దేవులాను అరెస్ట్ చేసింది. సుమారు రూ. 1.5 మిలియన్ల (15 లక్షలు) లంచం చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు.
సంబంధిత వార్తలు

ఆ సత్తా రాహుల్ గాంధీకి లేదు :లాలూ తనయుడు
లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ కు లేదని, ప్రియాంకగాంధీ మాత్రమే సమర్థవంతంగా నడపగలరని అన్నారు. ప్రియాంకను ఇందిరాగాంధీతో పోల్చారు తేజ్ ప్రతాప్. నితీష్ కుమార్ రాజీనామా చేసి వెళ్లిపోయారని, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని..అయినా రాహుల్ నితీశ్ గురించి మాట్లాడడంలో ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు తేజ్ ప్రతాప్.

OPERATION PAHLGHAM : పాక్‌కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్
పహల్గామ్ దాడి ఘటనకు రేపటితో ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను విడుదల చేసింది. కొన్ని బౌండరీలు ఎప్పటికీ దాటకూడదు, భారత్ ఎప్పటికీ మర్చిపోదు అనే టెక్స్ట్ తో ఉండే పోస్ట్ షేర్ చేసింది. హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ పై విరుచుకుపడింది.
భూ ప్రకంపనలు..జనం పరుగులు
మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం 5:59 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్‌లోని కామ్‌జాంగ్ ప్రాంతంలో కేంద్రంగా భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు రావడం ఇది రెండోసారి.
మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే
తమిళనాడు ఎన్నికల పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాదితో పోల్చారు. ఉగ్రవాదితో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుంటుంది అని ఖర్గే ప్రశ్నించారు. దక్షిణాది హక్కులను ప్రధాని మోదీ హరిస్తున్నారని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.