హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 20 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్ సీజ్ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫొర్స్ మెంట్ వింగ్, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టు రట్టు అయింది. ఒమన్, పాలస్తీనా కు చెందిన కేటుగాళ్లు ను అదుపు లోకి తీసుకొన్నారు. బెంగళూర్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, బడా బాబులు టార్గెట్ గా డ్రగ్స్ సప్లయ్ దందా నడుస్తోంది. కాలేజీ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ యువత విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి
కుప్పం నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కనుమనపల్లి చెరువులో పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో నీటిలో పడి మృతి చెందారు. మృతుల్లో 19 ఏళ్ల బేబీకి నెల రోజుల క్రితమే వివాహం జరగ్గా.. 21 ఏళ్ల దుర్గకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందడంతో కనుమనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
32 మంది బ్యాంకు అధికారుల్ని లోపలేసిన హైదరాబాద్ పోలీసులు
దేశవ్యాప్తంగా సైబర్ మోసాల నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ పేరిట భారీ దాడులు నిర్వహించామని సీపీ సజ్జనార్ తెలిపారు. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేసి బ్యాంకు అధికారులు సహా 52 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసాలకు అండగా నిలిచిన బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఆపరేషన్ సాగింద న్నారు. నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 20 మంది ఇతరులు ఉన్నారన్నారు.

DRONE ACCIDENT: తెలంగాణ MLAకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో డ్రోన్ ప్రదర్శన ప్రమాదకరంగా మారింది. వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన కొత్త డ్రోన్ పనితీరును పరిశీలిస్తుండగా.. సాంకేతిక లోపంతో అది ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో డ్రోన్ రెక్కలు తగిలి పరిగి MLA రామ్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది. ఆయనతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.