సారాంశం
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్రమంత్రి లేఖలో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ హామీల అమలుకు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఖజానా ఖాళీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఇటీవల ఓ సభలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారని గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే.. ‘రాష్ట్ర ఖజానా నిల్.. పార్టీ నాయకుల జేబులు ఫుల్’గా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
3 మార్చి, 2026 01:43 PMకి