-2.jpg)
కన్నపిల్లలనే.. కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.
సంబంధిత వార్తలు
.png)
వంద కోసం ప్రాణం తీశాడు..మంచిర్యాలలో ఘోరం
మంచిర్యాల జిల్లాలో కేవలం రూ. 100 అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. ముత్యంపేటకు చెందిన శంకరయ్య అనే వ్యక్తిని నిందితుడు కత్తితో పొడిచి చంపగా, అడ్డువచ్చిన అతని భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చిన్నపాటి అప్పు గొడవ కాస్తా ఒకరి ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది.

BREAKING: టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భార్య సంగీతతో ఆయన దాఖలు చేసిన విడాకుల కేసు విచారణను న్యాయస్థానం జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే ఆ రోజున విజయ్, సంగీత ఇద్దరూ తప్పనిసరిగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ విడాకుల సెటిల్మెంట్ కోసం భార్య సంగీత ఏకంగా రూ.250 కోట్ల భారీ భరణాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

FIRE ACCIDENT: బయో గ్యాస్ కంపెనీలో పేలుడు
తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో రిలయన్స్ బయో గ్యాస్ కంపెనీలో పేలుడు జరిగింది. అగ్నిప్రమాద ధాటికి చుట్టపక్కల దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మంచిర్యాలలో రూ.100 కోసం దారుణ హత్య..
మంచిర్యాల పట్టణంలో రూ.100 కోసం దారుణం జరిగింది. వంద రూపాయలు అప్పుగా ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. వ్యాపారం చేసుకుంటున్న దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.