LIVE
బూమ్రా, సంజూల ప్రదర్శనపై అదానీ ఆసక్తికర పోస్ట్
వెనక్కి
Sports

బూమ్రా, సంజూల ప్రదర్శనపై అదానీ ఆసక్తికర పోస్ట్

41 రోజుల క్రితం
సారాంశం

టీ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టును అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆకాశానికెత్తారు. టోర్నమెంట్ అసాంతం జట్టు కనబర్చిన అద్భుత ప్రదర్శన, కీలక ఆటగాళ్ల ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అన్ బిలీవబుల్, అన్ స్టాపబుల్, అన్ బీటెన్ భారత్.. అంటూ జట్టును అభినందించారు గౌతమ్ అదాని. ఈ సందర్భంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు గౌతమ్ అదాని. అతని బ్యాటింగ్ తీరు, నిలకడగా ఆడిన వైఖరిని కేరళలోని విజింజం పోర్ట్ లో గల ఓ భారీ క్రేన్ తో పోల్చారు. ఇంత నిలకడ, స్థిరత్వం విజింజం పోర్ట్ లో ఉండే క్రేన్ కు కూడా లేదని కితాబిచ్చారు. తిరువనంతపురం సమీపంలో ఉండే ఈ విజింజం పోర్ట్.. అదాని గ్రూప్ కు చెందినది. ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గురించీ ప్రస్తావించారు. బ్యాట్స్‌మెన్‌లు అతన్ని ఎదుర్కొనేటప్పుడు దారి తప్పిపోతారని, ఈ అహ్మదాబాద్ ప్లేయర్, ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెప్పారు. ట్రోఫీ మన ఇంటికొచ్చిందని అన్నారు.

షేర్ చేయండి:
9 మార్చి, 2026 11:51 AMకి

సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

5 గంటల క్రితం
టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

5 గంటల క్రితం
జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

5 గంటల క్రితం
జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

6 గంటల క్రితం