
విజయ్‌కు తొలి రాజకీయ పరీక్ష.. అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు
తమిళ రాజకీయాల్లోకి అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్, ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న నిర్ణయంతో కేడర్‌లో ఉత్సాహం నింపినా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాలుగా మారింది. పొత్తులు లేకుండా ముందుకు సాగాలన్న ఆయన వ్యూహం ఆచరణలో కష్టాలను తెచ్చిపెడుతోంది. టిక్కెట్లు ఆశించిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా తప్పుకోవడం పార్టీకి షాక్‌గా మారింది. కోటి రూపాయల పార్టీ ఫండ్‌తో పాటు, ఎన్నికల ఖర్చులన్నీ భరించాలన్న షరతులు కీలక అడ్డంకిగా నిలుస్తున్నాయి.ఆర్థిక, రాజకీయ సమీకరణాల మధ్య విజయ్ తొలి రాజకీయ ప్రయాణం పరీక్షకు గురవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.