LIVE
Download (1) 8
వెనక్కి
General

Hyderabad Rains హెచ్చరిక.!

2 గంటల క్రితం
Telangana
సారాంశం

హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తదుపరి 1 గంటలో కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, కాప్రా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నాచారం, దమ్మాయిగూడ, చర్లపల్లి, బొల్లారం, ఎల్‌బి నగర్, హయత్‌నగర్, బి.ఎన్. రెడ్డి ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ⚡🌧️ ఈ వర్షాలు తరువాత హైదరాబాద్ సెంట్రల్ మరియు సౌత్ ప్రాంతాలకు విస్తరించనున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండండి.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 04:28 PMకి

సంబంధిత వార్తలు

DEADLINE : ఈనెల 29లోగా లొంగిపోండి.. PM మోదీ డెడ్‌లైన్

DEADLINE : ఈనెల 29లోగా లొంగిపోండి.. PM మోదీ డెడ్‌లైన్

పశ్చిమ బెంగాల్‌లోని బాంకురాలో జరిగిన సభలో PM మోదీ టీఎంసీపై విరుచుకుపడ్డారు. ఈ నెల 29లోగా అవినీతిపరులు, గుండాలు పోలీసులకు లొంగిపోవాలని, మే 4 తర్వాత అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని,TMC ప్రభుత్వం మహిళా హక్కులను అడ్డుకుంటోందని, చొరబాటుదారుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికానికి TMC కారణమని, బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

7 నిమిషాల క్రితం
వడగండ్ల వాన...వరిపంట నష్టం

వడగండ్ల వాన...వరిపంట నష్టం

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.

28 నిమిషాల క్రితం
రేపే చందనోత్సవం..అప్పన్న నిజరూప దర్శనం!

రేపే చందనోత్సవం..అప్పన్న నిజరూప దర్శనం!

సింహాచలంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని చందనోత్సవం వైభవంగా జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఈ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ధర్మకర్తల దర్శనం అనంతరం... 3:30నుండి సామాన్య భక్తులను అనుమతి అనుమతిస్తారు. సాయంత్రం 6గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. ఈ ఏడాది సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

34 నిమిషాల క్రితం
ట్రంప్ ను హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు

ట్రంప్ ను హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు

అణు కార్యక్రమం మరియు హార్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశాల్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ అణు హక్కులను నిరాకరించే అధికారం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం... ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

40 నిమిషాల క్రితం