
ARMY POWER: గగనతల రక్షణకు ‘మిషన్ సుదర్శన్ చక్ర
శత్రు దేశాల దాడులను తిప్పికొట్టేందుకు భారత్ మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఏఐ ఆధారిత నెట్‌వర్క్ ద్వారా డ్రోన్లు, క్షిపణులు, హైపర్‌సోనిక్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఢిల్లీ లాంటి కీలక ప్రాంతాలకు ఇది ప్రధాన రక్షణ. 400కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రాజెక్ట్ కుషా తయారు చేస్తోంది.
సంబంధిత వార్తలు

బంగారు నిల్వలు ఎవరి దగ్గర ఎక్కువున్నాయో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 8,133.46 టన్నులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, జర్మనీ (3,350.25 టన్నులు), ఇటలీ (2,451.84 టన్నులు) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, రష్యా, చైనా తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ 880.18 టన్నులతో 7వ స్థానంలో నిలవడం గమనార్హం. జపాన్, టర్కీ, నెదర్లాండ్స్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!
ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

NEW MEDICINE : డెంగీ తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్
దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్‌ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రానుంది. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.