హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ 2026 బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. నేటి SRH vs CSK మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తగా, ఇదే అదునుగా కేటుగాళ్లు ధరలను అమాంతం పెంచేశారు. రూ. 2800 విలువైన టికెట్‌ను రూ. 6500 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్టేడియం పరిసరాల్లో బహిరంగంగానే ఈ అక్రమాలు జరుగుతున్నా, పోలీసులు వారిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

కర్నూలులో దారుణం..హాస్పిటల్ బెడ్‌పై బాలింతను చంపిన భర్త
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!
హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు
బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.
