వారం రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల గాయాల బెడద పలు జట్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యమైన ఆటగాళ్లలో కొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోగా, మరికొందరు పూర్తిగా టోర్నీకి దూరమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ జట్టులోని ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ముఖ్య బౌలర్‌గా ఉన్న జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.ఇప్పటికే హర్షిత్ రాణా లేక ఇబ్బందులు పడుతున్న కోల్‌కతా జట్టుకు మరో సమస్యగా మతీశా పతిరణ గాయం మారింది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొదటి వారంలో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు సూచించాయి.
సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్
KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!
కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
