LIVE
Capture 37
వెనక్కి
Sports

పంజాబ్‌ కింగ్స్‌కు టైటిల్ ఆశలు.. అయ్యర్‌పై బాధ్యతలు

30 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో ఫైనల్‌ వరకు వెళ్లి టైటిల్‌ కోల్పోయిన ఈ జట్టు ఈసారి కప్పు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ నాయకత్వం ఈ సారి జట్టు విజయానికి కీలకంగా మారనుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతుల్య బలం ఉన్న జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ కనిపిస్తోంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్‌, జాన్సెన్‌లతో బౌలింగ్‌ దళం బలంగా ఉండగా, పై బ్యాటింగ్‌ క్రమం కూడా దూకుడుగా ఉంది. ఈ అంశాలన్నీ కలిసివస్తే పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

షేర్ చేయండి:
21 మార్చి, 2026 08:34 AMకి

సంబంధిత వార్తలు

సిజిన్ షిప్ కు నో చెప్పిన రషీద్

సిజిన్ షిప్ కు నో చెప్పిన రషీద్

తనకు భారత్, ఆస్ట్రేలియా నుంచి సిటిజిన్ షిప్ ఆఫర్స్ వచ్చాయని అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు. కానీ నేను నా దేశం తరఫున మాత్రమే ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు బీసీసీఐకు చెందిన ఓ అధికారి భారత్ లోనే జీవించండి. క్రికెట్ ఆడండని ఆఫర్ చేశారు. కానీ నా సొంత దేశానికి మాత్రమే ఆడాలనుకుంటున్నానని చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు.

35 నిమిషాల క్రితం
ఆ క్రికెటర్ కే నా బ్యాట్ బహుమతి: శ్రేయస్

ఆ క్రికెటర్ కే నా బ్యాట్ బహుమతి: శ్రేయస్

పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భలే ఆఫర్ ఇచ్చాడు. ఈ IPL సీజన్ లో అత్యధిక సిక్స్ లు ఎవరు కొడతారో వారికి తన బ్యాట్ ను గిఫ్టిగ్ ఇస్తానని చెప్పాడు. లక్నోపై భారీ విజయం తర్వాత శ్రేయస్ మాట్లాడుతూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రియాంశ్ ఆర్యపై ప్రశంసలు కురిపించాడు. సిక్సర్ల గురించి జట్టు సమావేశాల్లో చర్చింకుంటామని, ఎవరైతే ఎక్కువ సిక్స్ లు కొడతారో వారికి తన బ్యాట్ గిఫ్టుగా ఇస్తానన్నాడు.

52 నిమిషాల క్రితం
రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

17 గంటల క్రితం
టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

17 గంటల క్రితం