ఇరాన్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. అమెరికా, మిత్రపక్షాలకు చెందిన ఆయిల్ ల్యాంకర్లను వరుస పెట్టి పేల్చేస్తోంది. ఇరాక్ ప్రాదేశిక జలాల్లో రెండు చమురు ట్యాంకర్లపై ‘సూసైడ్ బోటు’తో దాడి జరిగిన ఘటనలో ఓ భారతీయుడు మృతిచెందాడు. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్ తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు, గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చమురు లోడ్ చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో ఉన్న బోటు ట్యాంకర్లను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నౌకల్లో మంటలు చెలరేగి తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

కేరళ: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు మృతి!
కేరళ రాష్ట్రం త్రిస్సూరులో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

BRS UPDATE : రేవంత్ ఓటుకు నోటు కేసుపై పోరాటం
రేవంత్ రెడ్డికి సంబంధించిన 'ఓటుకు నోటు' కేసు విచారణ రేపు సుప్రీంకోర్టులో జరగనుందని BRS నేత హరీష్ రావు తెలిపారు. రేవంత్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తాము కూడా ఈ కేసులో కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం ప్రభుత్వం ఒక బలహీనమైన PPని నియమించిందని ఆరోపించారు.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. విజయనగరంలో ఘోర ప్రమాదం!
* నరవ గ్రామంలో తీవ్ర విషాదం.. వివాహం నిశ్చయమైన యువతి రేణుక (18) రోడ్డు ప్రమాదంలో మృతి. * బట్టల షాపు ప్రచారం కోసం ఆటోలో వెళ్తుండగా, గ్రామ శివారులో ప్రమాదవశాత్తూ కింద పడటంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయింది. * పెళ్లి పనులు మొదలవ్వాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. విధి ఆడిన వింత నాటకంలో విగతజీవిగా మారిన యువతి!

వెరైటీ దొంగ ... కేవలం నైట్ బస్సుల్లోనే చోరీలు
శివా రెడ్డి అనే వెరైటీ దొంగను పోలీసులు పట్టుకొన్నారు. కేవలం రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణిస్తూ, నిద్రపోతున్న ప్యాసింజర్స్ దగ్గర నుంచి పర్సులు కొట్టేస్తుంటాడు. తాజాగా ఒక బస్సులో లేడీ డాక్టర్ నుంచి బంగారు ఆభరణాలు కొట్టేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా దొరికిపోయాడు.
