చమురు నిక్షేపాలున్న తూర్పు ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 19 డ్రోన్లను సౌదీ రక్షణ బలగాలు ధ్వంసం చేశాయి. మరోవైపు, బహ్రెయిన్‌లో క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగాయి. కువైట్‌పైనా ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ దాడులను అడ్డుకునే క్రమంలో ఏడు ఓవర్‌హెడ్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల కువైట్‌లోని పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఇవాళ 5 బాలిస్టిక్ మిస్సైళ్లు, 17 డ్రోన్లను అడ్డుకున్నట్లు యూఏఈ తెలిపింది.
సంబంధిత వార్తలు

రోడ్డు కోసం మంచంతో పోరాటం..
నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. అధికారులు రోడ్డు పనులను సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. నడిరోడ్డుపై మంచం వేసుకుని కూర్చుకున్నాడు. వచ్చే వాహనాలను ఆపేశాడు. వెంటనే రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యేని, అధికారులను డిమాండ్ చేశాడు. లేని పక్షంలో గ్రామస్థులంతా కలిసి డబ్బులు వసూలు చేసి స్వయంగా రోడ్డు వేసుకుంటామని తేల్చి చెప్పాడు.

అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
* వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి * ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగడం వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది. * టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా, ఆహారంపై దృష్టి పెట్టి తినండి. * ప్రతి ముద్దను కనీసం 20-30 సార్లు నమలడం అలవాటు చేసుకోండి.

పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?
TG: తెలంగాణ పాలిసెట్-2026 అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగియనున్నది. వచ్చే నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ –ఇంజినీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేయవచ్చు.
పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్
వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.