LIVE
IMG 4291 2
వెనక్కి
CrimeGeneral

హర్మూజ్ వద్ద కాల్పులపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

11 గంటల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

హర్మూజ్ వద్ద 2 భారతీయ నౌకలపై ఇరాన్ కోస్ట్‌గార్డ్ కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాణిజ్య నౌకయానం, నావికుల భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని, కాల్పులపై తమ ఆందోళనను తెలియజేయాలని ఇరాన్ రాయబారికి భారత్ సూచించింది. హర్మూజ్‌ను దాటే సురక్షిత మార్గాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని చెప్పింది. కాగా, భారత్ అభిప్రాయాలను ఇరాన్‌కు తెలియజేస్తామని ఆ దేశ రాయాబారి చెప్పారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 09:38 AMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

14 నిమిషాల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

17 నిమిషాల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

18 నిమిషాల క్రితం
ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్

ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్

తమ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, వంతెనను నాశనం చేస్తామంటూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చల కోసం రేపు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లనుంది. తమ ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు ట్రంప్. లేకపోతే తానేంటో చూపిస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

36 నిమిషాల క్రితం