LIVE
Iraniana Oil Tankers Reach India
వెనక్కి
International

భార‌త్‌కు చేరుకున్న ఇరాన్ ముడిచ‌మురు నౌక‌లు

6 రోజుల క్రితం
సారాంశం

మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ ఇరాన్ ముడిచ‌మురుతో రెండు నౌక‌లు భార‌త్ కు చేరుకున్నాయి. ఓ నౌక ఒడిశాలోని పారాదీప్ ఓడ‌రేవుకు చేరుకోగా.. మ‌రొక‌టి గుజ‌రాత్‌లోని సిక్కా ఓడ‌రేవులో లంగ‌రు వేసింది. నేష‌న‌ల్ ఇరానియ‌న్ ట్యాంక‌ర్ కంపెనీకి చెందిన ఈ రెండు నౌక‌లు మార్చి తొలివారంలో ఖ‌ర్గ్ ద్వీపం నుంచి చ‌మురు లోడ్ చేసుకున్న‌ట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది.

షేర్ చేయండి:
13 ఏప్రిల్, 2026 12:48 PMకి

సంబంధిత వార్తలు

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి

అమెరికాలోని లూసియానాలో కాల్పుల కలకలం రేగింది. రద్దీ ప్రాంతంలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది పిల్లలు మృతి చెందారు. మృతుల వయసు 1 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నట్లు ష్రీవ్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు కారు దొంగిలించి పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు తెలిపారు.

3 గంటల క్రితం
మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా

మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ లో మలి విడత చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. ట్రంప్ రెచ్చ గొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చల ప్రక్రియపై అందరి దృష్టీ కేంద్రీకృతం అయి ఉంది. అమెరికా ప్రతినిధులు సోమవారం పాక్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల రాకపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే.. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించక పోతే భారీ వినాశనం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు.

3 గంటల క్రితం
ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..

ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు ,చమురు ట్యాంకర్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా, హర్మూజ్ వద్ద 23 నౌకలను అడ్డుకుని తనిఖీలు చేపట్టింది.ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదంఉంది.

17 గంటల క్రితం
ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??

హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.

18 గంటల క్రితం