వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 21 నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ఆయన 'ప్రజాదర్బార్' నిర్వహిస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్లలో ఇటీవల మరణించిన పార్టీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
సంబంధిత వార్తలు

BRS UPDATE : ఢిల్లీకి కేసీఆర్ టీం.. ఫిరాయింపులు, కాళేశ్వరం కేసులు
BRS పార్టీ కీలక నేతల ఢిల్లీ టూర్ పై అప్ డేట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి వెళ్లింది. KCR ఆదేశాల మేరకు హరీష్‌రావు, వినోద్ కుమార్, MP వద్దిరాజు రవిచంద్ర సాయంత్రం ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

రేవంత్ రెడ్డి అభినవ గోబెల్స్: బండి సంజయ్
సీఎం రేవంత్ రెడ్డిని 'అభినవ గోబెల్స్' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలు, మోసాలతోనే సీఎం అయ్యారని, 6 గ్యారంటీలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఇండియా కూటమి నేతలు అడ్డుకున్నారని, ఇందులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మండిపడ్డారు.

చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా..!!
సీఎం చంద్రబాబు కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు ల మీద బాబు దృష్టి పెట్టారు అని చెప్పారు. సుపరిపాలన ద్వారా మంచి ప్రభుత్వం అన్న మాట ను చంద్రబాబు సాకారం చేస్తారు అని ఆకాంక్షించారు.

LEAGAL FIGHT : కాళేశ్వరంపై BRS న్యాయపోరాటం
హరీష్ రావు ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. కాళేశ్వరం పిటిషన్‌పై ఎల్లుండి హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆయన ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యేందుకు ఆయన హుటాహుటిన హస్తినకు చేరుకున్నారు.
.png)