LIVE
Screenshot (379)
వెనక్కి
Politics

జనసేన 'క్లీన్ స్వీప్' టార్గెట్

27 రోజుల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కీలక సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతల సమక్షంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 09:56 AMకి

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

19 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

35 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

46 నిమిషాల క్రితం
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

58 నిమిషాల క్రితం